Malvi Malhotra: టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ మాల్వి మల్హోత్రా, ఇంతకీ ఈ ముద్దుగుమ్మ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
రాజ్ తరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తిరగబడరా సామి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మాల్వి మల్హోత్రా. ఈ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Photo Credit: MALVI MALHOTRA/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాల్వి తొలి తెలుగు సినిమా విడుదలకాక ముందే రాజ్ తరణ్ వివాదంతో ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమె కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరం అయ్యాడని అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఆరోపించింది. అంతేకాదు, రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
మాల్వి మల్హోత్రా హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వి చండీగఢ్ లోనే చదివింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో మాస్టర్స్ చేసింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో టీవీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 2017లో ‘ఉడాన్’ అనే సీరియల్ లో కనిపించింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
'హోటల్ మిలన్' అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద దర్శనం ఇచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ చిత్రాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. 2023లో 'అభ్యుహం' అనే మలయాళం మూవీలో నటించింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
ఇప్పుడు రాజ్ తరుణ్ తో కలిసి 'తిరగబడరా స్వామి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈమూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
మాల్వి తొలి సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలోనే రాజ్ తరణ్ ప్రియురాలు కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. Photo Credit: MALVI MALHOTRA/Instagram
అటు తనను అనవసర వివాదంలోకి లాగిన లావణ్యపై పరువు నష్టం దావా వేయాలని మాల్వి మల్హోత్రా భావిస్తున్నట్లు తెలుస్తోంది. Photo Credit: MALVI MALHOTRA/Instagram