Vishnu Priya: అందాల విందుతో మతిపోగొడుతున్న విష్ణుప్రియ.. ‘ఆహా’ వెబ్‌సీరిస్‌లో ఛాన్స్!
‘పోవే-పోరా’ షోతో కుర్రకారు మనసు దోచిన విష్ణుప్రియ అందాల ఆరబోతలో ఎప్పుడూ వెనకాడదు. డ్యాన్స్ చేస్తూ.. వ్యాయమం చేస్తూ.. తన గ్లామర్‌తో అభిమానుల్లో సెగలు పుట్టిస్తుంది. ఈ నేపథ్యంలో విష్ణుకు అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా ఒరిజనల్ సంయుక్తగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్వరలో ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న ‘ద బేకర్ అండ్ బ్యూటీ’ వెబ్‌సీరిస్ ద్వారా విష్ణు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం యాంకరింగ్‌కు దూరంగా ఉన్న విష్ణు.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది.
ఇజ్రాయెల్‌లో ప్రేక్షకాధరణ పొందిన ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సీరిస్నే తెలుగులో సుప్రియా యార్లగడ్డ రీమేక్ చేస్తున్నారు. ఇందులో ‘పేపర్ బోయ్’, ‘ఏక్ మినీ కథ’ ఫేమ్.. సంతోష్ శోభన్, టీనా శిల్పారాజ్, విష్ణు ప్రియా, వెంకట్, ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్, స్వేతా, సంగీత్ శోభన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ వెబ్‌సీరిస్‌లో విష్ణు ప్రియకు కొన్ని ముద్దు సీన్లు కూడా ఉంటాయట. మంగళవారం ఈ వెబ్‌సీరిస్ పోస్టర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది.
సెప్టెంబరు 10 వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్‌సీరిస్ విడుదల కానుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఈ వెబ్‌సీరిస్‌లో ఉంటాయట. ‘ఆహా’లో ఇదే అతి పెద్ద వెబ్‌సీరిస్ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
అయితే, విష్ణుప్రియ ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా మరోసారి అందాల విందు చేసింది. బోల్డ్ డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.