InPics: ఓవల్ చేరుకున్న భారత జట్టు... జోరుగా ప్రాక్టీస్... సెప్టెంబరు 2 నుంచి నాలుగో టెస్టు
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు కోసం టీమిండియా ఓవల్ చేరుకుంది.
ఓవల్ చేరుకున్న టీమిండియా మంగళవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది.
సెప్టెంబరు 2 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.
ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి.
లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే... హెడింగ్లీ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది.
ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడు నాలుగో టెస్టులో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ ఫొటోలను బీసీసీఐ ట్విటర్ ద్వారా పంచుకుంది.
నాలుగో టెస్టు కోసం కోహ్లీ తుది జట్టులో మార్పులు చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.