‘Thank God’ promotion: రకుల్, సిద్ధార్థ్ సందడి!
దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమైథలాజికల్ కథాంశంతో, పునర్జన్మ, స్వర్గం-నరకం అనే స్టోరీ లైన్ తో కామెడీ మూవీగా రూపొందింది.
దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది.
ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అదే స్థాయిలో వివాదాలనూ మూటగట్టుకుంది.
ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.
‘థ్యాంక్ గాడ్’ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు.
హిందూ దేవుళ్లను అనుచితంగా ప్రదర్శించారని, హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని ఆరోపించారు.
కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా చిత్రీకరణ జరుపుకుందన్నారు.
‘థ్యాంకూ గాడ్’ సినిమాలో అజయ్ దేవ్ గణ్ మోడ్రన్ చిత్రగుప్తుడిగా కనిపించాడు. బూట్లు వేసుకొని, కూలింగ్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్ తో స్టైలిష్ గా కనిపించాడు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా తీశారని విమర్శలు వస్తున్నాయి.