tamanna Latest Photo: తమన్నా హాట్ లుక్ - మిర్చి రెడ్ డ్రెస్స్‌లో 'మిల్కీ బ్యూటీ' అందాల విందు
Tamannaah Latest Photos: ఈ మధ్య వెండితెరపై మిల్కీ బ్యూటీ తమన్నా సందడి పెద్దగా కనిపించడం లేదు. అయితే నటుడు విజయ్ వర్మతో డేటింగ్ వార్తలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. తరచూ ముంబై రోడ్లపై చక్కర్లు, డిన్నర్ డేట్స్, ఈవెంట్‌కు జంటగా వెళుతూ ఫ్యాన్స్‌ని కనువిందు చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. దీంతో ఈ బ్యూటీ ఇప్పట్లో సినిమాల్లో కనిపించడం కష్టమే. ఇదిలా ఉంటే తాజాగా ఓ షోలో పాల్గొన్న తమన్నా రెడ్ డ్రెస్‌లో మెరిసింది. మిర్చి కలర్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోసి రెడ్ హాట్లా కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిర్చి రెడ్ డ్రెస్సులో తమన్నాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమన్నా చాలా హాట్ గురూ అంటూ ఆమె ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమన్నా ఫెమినిజం(స్త్రీవాదం)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనలో ఫేమినిజం భావాలు లేవని.. పురుష, స్త్రీ శక్తి సమానంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఫెమినిజం అనే భావన ఒక్క మహిళలకు మాత్రమే సంబంధించింది కాదు.దీనికి స్త్రీకి మాత్రమే అర్హత కలిగి లేదని చెప్పింది.ఇద్దరిలో ఇలాంటి భావాలు ఉండోచ్చని.
ఫెమినిజం అనేది స్త్రీ, పురుషులు ఇద్దరికి సంబంధించినదే. ఎందుకంటే ఇది నమ్మకానికి సంబంధించింది. ఒక మనిషిగా ఉన్నప్పుడు మనలో వివిధ లక్షణాలు, భావాలు ఉంటాయి. స్త్రీలో మాత్రమే ఈ రకమైన భావాలు ఉంటాయి, పురుషులలో ఇవి ఉండవని చెప్పలేం.
మనిషులుగా మనలో ఒక్కొసారి స్త్రీ, పురుష తత్త్వాలు రెండూ ఉంటాయి. ఒక్కోసారి నేను పురుషుడిగా కూడా ఆలోచిస్తానని చెప్పి షాకిచ్చింది. ఎప్పుడైన నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు పురుషుడిలా ఆలోచిస్తాను.. అదే పురుషుడు కొన్నిసార్లు స్త్రీగా కూడా ఆలోచించవచ్చని అనుకుంటున్నాను. కాబట్టి ఒక మనిషిగా మనలో ఇద్దరు(సగం స్త్రీ మరియు సగం పురుషులు) ఉంటారనేది నా అభిప్రాయం అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.