Madi Telugu Movie : రొమాంటిక్ లవ్ స్టోరీ - 'మది'లో ఏముంది?
ప్రగతి పిక్చర్స్ పతాకంపై రామ్ కిషన్ 'మది' సినిమాను నిర్మిస్తున్నారు. నాగ ధనుష్ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App''రొమాంటిక్ లవ్ స్టొరీగా 'మది'ని తెరకెక్కించాం. ఈ తరం యువత ఆలోచనా విధానాలకు అద్దం పట్టేలా ఉంటూ... వినూత్న రీతిలో కథనం సాగుతుంది. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. వాటిని రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించారు'' అని నిర్మాతలు తెలిపారు.
విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 'మది' సినిమా షూటింగ్ చేశారు. 'మది' సినిమాకు ఆర్వి సినిమాస్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్వి రెడ్డి సమర్పణ సినిమా రూపొందింది.
'మది' సినిమా వర్కింగ్ స్టిల్స్
'మది' సినిమా వర్కింగ్ స్టిల్స్
'మది' సినిమా వర్కింగ్ స్టిల్స్