Sreemukhi : నీలిరంగు లంగా ఓణిలో చందమామల మెరిసిపోతున్న శ్రీముఖి
శ్రీముఖి సంక్రాంతి స్పెషల్ పోస్ట్ చేసింది. లంగా ఓణిలో బాగా ట్రెడీషనల్ లుక్‌లో రెడీ అయింది. సంక్రాంతి ముగ్గులు మధ్యలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుమ్మం దగ్గర పువ్వులను సెట్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. పూలతో వచ్చిన లంగాకు ప్లేన్‌గా వచ్చిన బ్లూ కలర్ ఓణిని జత చేసింది. దానికి తగ్గట్లే ఆభరణాలు ధరించింది.(Image Source : Instagram/sreemukhi)
జుట్టుకి క్లిప్ పెట్టుకుని మినిమల్ మేకప్‌తో రెడ్ లిప్‌స్టిక్ ధరించి.. కుంకుమబొట్టు పెట్టుకుని సంక్రాంతి కళ ఉట్టిపడేలా ముస్తాబైంది. ఇంటికి కూడా సంక్రాంతి కళ ఉట్టిపడేలా డెకరేషన్ చేశారు. (Image Source : Instagram/sreemukhi)
తెలుగులో యాంకర్‌గా అలరిస్తున్న శ్రీముఖి.. ముందు నటిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెల్లుగా నటించి వెండితెరకు పరిచయమైంది. (Image Source : Instagram/sreemukhi)
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా.. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ప్రధాన నటిగా కూడా మెప్పించింది. తర్వాత నేను శైలజ సినిమాలో హీరో రామ్‌కి సిస్టర్‌గా నటించింది. తర్వాత ఆఫర్లు తగ్గడంతో కెరీర్‌ను బుల్లితెరవైపు మల్లించింది. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు తెలుగులోనే మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/sreemukhi)
పటాస్ అనే షోతో యాంకర్‌గా శ్రీముఖి ఓ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె వేసే పంచులు, ఓసేయ్ రాములమ్మ స్టెప్లు ఓ రేంజ్లో ట్రెండ్ అయ్యాయి. ఆ సమయంలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లింది. టైటిల్ విన్నర్ శ్రీముఖి అనే రేంజ్లో గేమ్ ఆడింది. కానీ రన్నరప్‌గా నిలిచింది.(Image Source : Instagram/sreemukhi)
బిగ్‌బాస్ అనంతరం పలు షోలు, గేమ్ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా నటిస్తూనే సినిమాల్లో అడపా దడపా కనిపిస్తుంది. ప్రస్తుతం స్టార్‌మాలో సూపర్ సింగర్‌కు యాంకర్‌గా చేస్తుంది.(Image Source : Instagram/sreemukhi)