Shriya Saran Photos: లెహంగాలో శ్రియ - రిసెప్షన్‌కు ఇలా వెళితే అందరి కళ్లు మీ మీదే ఉంటాయ్ మరి
ఇప్పుడు శ్రియా శరణ్ వయసెంతో తెలుసా? నాలుగు పదులు! ఆమెను చూస్తే ఆ విధంగా అసలు కనిపించరు. స్టైల్స్ విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ ప్రేక్షకులకు డ్రస్సింగ్ టిప్స్ అందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో లేటెస్టుగా లెహంగా ధరించిన ఫోటోలను శ్రియా శరణ్ షేర్ చేశారు. ఆ ఫోటోలను చూడండి. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
ఫెస్టివల్స్, మ్యారేజెస్... ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు మహిళలు చాలా మంది ప్రిఫర్ చేసే డ్రస్సింగ్ లెహంగా. సాధారణంగా లెహంగాలు బ్రైట్ కలర్స్ ఉంటాయి. కానీ, శ్రియా శరణ్ కొత్త స్టైల్ సెట్ చేశారు. బ్లాక్ కలర్ లెహంగా ధరించారు. చూస్తే.. ఇది కలర్ కూడా బావున్నట్టు లేదూ!? (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
2023... గత ఏడాది శ్రియా శరణ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో ఒకటి... ఉపేంద్రకు జోడీగా నటించిన పాన్ ఇండియా సినిమా 'కబ్జా'. మరొకటి... హిందీ సినిమా మ్యూజిక్ స్కూల్. ఆ రెండు ఆశించిన విజయాలు సాధించలేదు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
పెళ్లి తర్వాత శ్రియా శరణ్ కొన్ని రోజులు సినిమాలు చేశారు. అమ్మాయి రాధకు జన్మ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. పాప కొంచెం పెద్దది కావడంతో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
తెలుగులో అగ్ర హీరోలు అందరితో శ్రియ సినిమాలు చేశారు. యంగ్ స్టార్ హీరోల సరసన కూడా సినిమాలు చేశారు. కమర్షియల్ సినిమాలు కాకుండా ఇప్పుడు కొత్త తరహా సినిమాల వైపు శ్రియ మొగ్గు చూపుతున్నారు. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
శారీలో శ్రియా శరణ్ (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
శ్రియా శరణ్ (Image Courtesy: Shriya_saran1109 / Instagram)