Shruti Haasan: ఇది 2024 అమ్మాయిలను ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేయండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన శ్రుతిహాసన్ !
సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతిహాసన్ అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంటుంది. రీసెంట్ గా తన ఇన్ స్టా లో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రేమ గురించి మాట్లాడిన శ్రుతి..అదో అద్భుతమైన భావన, మన జీవితాలను నడిపించేంది ప్రేమే అంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసేమ్ టైమ్ కొందరు అభిమానులు పెళ్లిగురించి క్వశ్చన్ చేయడంతో చిరాకు పడింది. పెళ్లెప్పుడు అని ఓ నెటిడన్ అడగ్గా..నేను చేసుకోను సర్ అంటు సరదాగా రిప్లై ఇచ్చింది. ఇది 2024 అమ్మాయిలను ఇలాంటివి అడగడం మానేయండి అంది. అమ్మాయిలకు ఎలా నచ్చితే అలా ఉండనివ్వండి..దయచేసి వ్యక్తిగత రిలేషన్ షిప్ కి సంబంధించిన క్వశ్చన్స్ వేయొద్దు అని చెప్పేసింది.
ఇంతకీ మీరు సింగిలా రిలేషన్లో ఉన్నారా అని మరో అభిమాని అడిగితే..అలాంటి క్వశ్చన్స్ నచ్చవు అంటూనే సింగిల్ అని క్లారిటీ ఇచ్చేసింది. ఆర్టిస్ట్ శాంతను హజారికతో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగించింది. రీసెంట్ గా ఇద్దరి రిలేషన్ బ్రేకప్ అయింది.
రీసెంట్ గా సలార్ లో నటించిన శ్రుతి ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ‘ఇనిమేల్’ అనే సాంగ్ లో మెరిసింది. డకాయిట్ మూవీలో నటిస్తోంది. ప్రస్తుంత చెన్నై స్టోరీ, సవార్ సీక్వెల్లో నటిస్తోంది. రజనీకాంత్ కూలీలోనూ నటిస్తోంది శ్రుతిహాసన్
శ్రుతిహాసన్ (Image Courtesy : Shrutzhaasan / Instagram)