Kalki Bujji: కాకినాడలో ప్రభాస్ 'కల్కి' బుజ్జి - ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదుగా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'బుజ్జి' వాహనానికి ఉన్న క్రేజే వేరు.
'కల్కి' సినిమాలోని బుజ్జి వాహనాన్ని కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మల్టీఫ్లెక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు.
ఎస్ఆర్ఎంటీ థియేటర్ యాజమాన్యం 'బుజ్జి' వాహనాన్ని సరదాగా నడిపారు. ఎన్ని వాహనాలు ఉన్నా బుజ్జికి ఉండే క్రేజ్ వేరే లెవల్ అంటూ చెబుతున్నారు.
'బుజ్జి' వాహనం చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో ఎస్ఆర్ఎంటీ థియేటర్ వద్దకు చేరుకున్నారు. వీరిని నిలువరించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.
ప్రైవేట్ సెక్యూరిటీతో థియేటర్ యాజమాన్యం ఫాన్స్‌ను కంట్రోల్ చేశారు. బుజ్జిని చూసిన అభిమానులు ఈలలతో సందడి చేశారు.
'బుజ్జిని ఇలా స్టార్ట్ చేయాలి' - వాహనం నడుపుతున్న థియేటర్ యజమాని, సందడి చేసిన అభిమానులు
కల్కి 'బుజ్జి' వాహనంతో థియేటర్ యాజమాన్యం ఫోటోలు. 'బుజ్జి' ప్రదర్శనతో థియేటర్ ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.