Sara Ali Khan: రెట్రో లుక్‌తో షాకిచ్చిన సారా అలీ ఖాన్ - ఆ నటితో పోలుస్తున్న నెటిజన్లు
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆమె `ఏ వతన్ మేరే వతన్` సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర పోరాట యోధురాలిగా కనిపించనుంది. అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్.
‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సైఫ్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సారా.
అయితే తనదైన నటన, టాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది సారా. సంప్రదాయంగా కనిపిస్తూనే, గ్లామర్ మెరుపులు మెరిపించడంలో ముందుంటుంది.
హీరోయిన్గా బిజీ ఉంటూనే సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెట్రో లుక్‌లో షాకిచ్చింది. ఇందులో ఆమెను చూసి అలనాటి తార షర్మిలా ఠాకూర్‌ను గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రియులు
మరోవైపు రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లను అలరిస్తోంది. సినిమా షూటింగ్స్ లో ఏ చిన్న బ్రేక్ దొరికినా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటుంది. ప్రసిద్ధ హిందూ ఆలయాలను సందర్శిస్తుంది. అత్యంత క్లిష్టమైన అమర్ నాథ్ యాత్ర చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రీసెంట్గా సారా అక్షయ్ కుమార్, ధనుష్ తో కలిసి ‘అత్రంగి రే’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవలే విక్కీ కౌశల్ సరసన ' జర హాట్కే జర బచ్కే' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.