Pooja Kannan Engagement: సిస్టర్ పూజ ఎంగేజ్మెంట్లో సాయి పల్లవి సందడి చూశారా?
సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే, ఆమె చెల్లెలు పూజా కణ్ణన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మనసుకు నచ్చిన అబ్బాయి లభించడంతో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వినీత్ అనే యువకుడితో తాను ప్రేమలో ఉన్నట్లు సాయి పల్లవి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అతడిని నెటిజనులు పరిచయం చేశారు. (Image Courtesy: poojakannan_97 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 21... ఈ ఆదివారం వినీత్, పూజా కణ్ణన్ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషాల నడుమ జరిగింది. ఆ ఫోటోలను లేటెస్టుగా పూజ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మా కుటుంబం పెద్దది అయ్యింది. నా మనసు దాచుకోలేనంత ప్రేమ నాకు లభించింది' అని పూజ పేర్కొన్నారు. (Image Courtesy: poojakannan_97 / Instagram)
చెల్లెలు నిశ్చితార్థంలో సందడి అంతా సాయి పల్లవిది అని చెప్పాలి. ఆమె ఫేస్ చూస్తే... ఆ సంతోషం కనిపించడం లేదూ! (Image Courtesy: poojakannan_97 / Instagram)
సంతోషంతో, సిగ్గుతో వినీత్ గుండెల్లో తన ముఖాన్ని దాచుకున్న పూజా కణ్ణన్. నిజం చెప్పాలంటే... ఆమె ప్రేమలో పడిన విషయం నెటిజనులు షాక్ ఇచ్చింది. ఎందుకంటే... తమిళంలో ఆమె ఓ సినిమా చేశారు. నటిగా కంటిన్యూ అవుతారని అందరూ అనుకున్నారు. ఇంతలో ఇలా పెళ్లికి రెడీ అయ్యారు. (Image Courtesy: poojakannan_97 / Instagram)
చెల్లెలు పూజతో సాయి పల్లవి (Image Courtesy: poojakannan_97 / Instagram)
చెల్లెలు పూజతో సాయి పల్లవి (Image Courtesy: poojakannan_97 / Instagram)
పూజా కణ్ణన్ (Image Courtesy: poojakannan_97 / Instagram)