Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ స్టన్నింగ్ లుక్స్
కన్నడ భామ రష్మిక మందన్నా వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది.
వికాస్ బహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ట్రైలర్ లో కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. రష్మిక వాటిని పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.
‘గుడ్ బై’ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది.
పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా కపూర్లు నిర్మించారు.
రష్మిక చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది.