Baby Raha Kapoor : రణ్‌బీర్, ఆలియా ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. క్రిస్మస్ రోజు రాహాను పరిచయం చేసిన బీటౌన్ జంట
బాలీవుడ్ సూపర్ హాట్ జంట్ రణ్‌బీర్ ఆలియా తమ కుమార్తెను మీడియా ముందుకు తీసుకొచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిస్మస్ సందర్భంగా ఓ వేడుకలో పాల్గొన్న ఈ జంట తమ కుమార్తె రాహాను మీడియా ముందుకు తీసుకొచ్చింది. రణ్‌బీర్ పాపను ఎత్తుకుని మీడియాకు చూపించారు.
ఇప్పటివరకు పాపను మీడియా ముందుకు తీసుకురాకుండా, ఫోటోలు బయటకి రాకుండా చూసుకున్న ఈ జంట వారే.. దగ్గరుండి పాపను మీడియాకు పరిచయం చేశారు.
రాహా కపూర్ వైట్ డ్రెస్‌లో క్యూట్ హెయిర్ స్టైయిల్‌తో.. రెడ్ షూలతో చాలా క్యూట్‌గా ఉంది. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
క్రిస్మస్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆలియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. రణ్‌బీర్ ఆలియాను హగ్ చేసుకున్న ఈ ఫోటో చాలా క్యూట్‌గా ఉందంటూ నెటిజన్స్ విష్ చేస్తున్నారు.
ఈ క్రిస్మస్ పార్టీలో తన తల్లి, అక్కతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది ఆలియా. ఉదయాన్నే షేర్ చేసిన ఈ ఫోటోల్లో రాహాను మాత్రం చూపించలేదు.
క్రిస్మస్ ట్రీ బాల్స్‌పై రాహా, ఆలియా ఉన్న బెలూన్స్ ఫోటోను మాత్రం ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఆలియా. ఏది ఏమైనా క్రిస్మస్ గిఫ్ట్‌గా రాహాను పరిచయం చేశారంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.