Priyanka Chopra: బల్గారీ ఈవెంట్ లో ప్రియాంక- లైట్ పింక్ డ్రెస్సులో కనువిందు
హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె, ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో గ్లోబల్ సినీ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో జరిగిన ఇండియా బల్గారీ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.
బల్గారీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది.
ఈ ఈవెంట్ లో లేత గులాబీ రంగు డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.
అటు ప్రియాంక ఇటీవల ఆస్కార్ కు నామినేట్ అయిన ‘టు కిల్ ఎ టైగర్’ అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.
ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ‘ది బ్లఫ్’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది.
మరికొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ ప్రియాంక కీలక పాత్రల్లో నటిస్తోంది.