Pawan Kalyan Latest Look : TFJA వెబ్సైట్ లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్
TFJA అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న 'తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్' వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న లక్ష్మీనారాయణ, వైజే రాంబాబు, నాయుడు సురేంద్ర కుమార్
''175 మంది సభ్యులున్న 'తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్'లో నాకు బాగా నచ్చిన అంశం జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత బీమా కింద రూ. 15 లక్షలు, యాక్సిడెంట్ పాలసీ కింద రూ. 25 లక్షలు ఇవ్వడం జర్నలిస్టుల కుటుంభం సభ్యులకు ధైర్యాన్ని ఇస్తుంది'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
''ఆదర్శవంతమైన జర్నలిజంతో సమాజంలో తప్పు ఒప్పులను సరి చేసేలా, అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా, ఒకవేళ వివాదాలు ఏమైనా జరిగితే... గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుందని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా'' అని పవన్ తెలిపారు.