Banks FD: ఇదే మంచి టైమ్! ఏడాది ఎఫ్డీకే 6% వడ్డీ - బ్యాంకుల లిస్ట్ ఇదే!
ఒకప్పుడు పెట్టుబడి సాధనం అనగానే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (Bank FDs) గుర్తొచ్చేవి! పిల్లలు పుట్టినా, కారో లేదా బైకో కొనుగోలు చేయాలన్నా ఫిక్స్డ్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో వడ్డీరేట్లు అలా ఉండేవి. ఒకానొక సమయంలో 8-10 శాతం వడ్డీ ఇచ్చేవారు. పరిస్థితుల ప్రభావంతో ఎఫ్డీల వడ్డీ ఆదాయం ఏటా తగ్గుతూ వచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లు, ప్రావిడెంట్ ఫండ్లలో మెరుగైన రాబడి రావడంతో అక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలైంది. మళ్లీ ఇన్నా్ళ్లకు ద్రవ్యోల్బణం వల్ల ఆర్బీఐ రెపో రేటు పెంచుతూ పోతోంది. ఫలితంగా బ్యాంకులు ఫిక్సడ్ డిపాజిట్ల వడ్డీరేట్లనూ సవరించాయి. ఇప్పుడు ఏడాది కాలపరిమితికే 6 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు (IDFC First Bank) మిగతా వాళ్లతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తోంది. సాధారణ పౌరులకు 5.57 సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ ఇస్తోంది. అంటే లక్ష రూపాయలకు వరుసగా రూ.5,750, రూ.6,250 వడ్డీ వస్తుందన్నమాట.
ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) వరుసగా 5.60 శాతం, 6.10 శాతం వడ్డీ అమలు చేస్తోంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank), కెనరా బ్యాంకులు (Canara Bank) సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ ఇస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) సాధారణ పౌరులకు 5.30 శాతం వడ్డీ ఇస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) 5.45 శాతం అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇక పంజాబ్ సింధ్ బ్యాంక్ (Punjab and Sindh Bank) సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్లకు 5.65 శాతమే ఇస్తోంది.