Samyuktha Menon: కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానంటున్న కేరళ కుట్టి
కేరళ కుట్టి సంయుక్త మీనన్.. మలయాళం, తమిళం,కన్నడంతో పాటూ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కళ్యాణ్-రానా నటించిన భీమ్లానాయక్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన కళ్యాణ్ రామ్ 'బింబిసార' తో సూపర్ హిట్టందుకుంది. రీసెంట్ గా ధనుష్ 'సార్' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.
ఈమె తెలుగులో మొదట కళ్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఆలస్యం కావడంతో ముందుగా ‘భీమ్లా నాయక్’ మూవీతో పలకరించింది.
1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త మీనన్..ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్’ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చేసిన అంజనా పాత్ర ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
తమిళంలో ‘కలరి’ , ‘లిల్లీ’ సినిమాల్లో నటించింది.
కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానంటున్న సంయుక్త మీనన్..చేసిన మంచి రక్షిస్తుంది - చేసిన చెడు నీడలా వెంటాడుతుంది. కృష్ణభగవానుడు చెప్పిన ఈ మాట.. అక్షర సత్యమని భావిస్తాను. సాధ్యమైనంత వరకూ మంచి చేయడానికే ప్రయత్నిస్తానంటోంది.
సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)
సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)
సంయుక్తమీనన్ (Image Credit/ Samyuktha Menon Instagram)