Paidi Jairaj: అసమాన హీరో పైడి జైరాజ్
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పైడి జైరాజ్ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూకీ చిత్రాలతో ఆరంభమైన పైడి జైరాజ్ నట ప్రస్తానం.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా కొనసాగింది. జయరాజ్ ప్రధానంగా హిందీ, మరాఠీ , ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ మలయాళం భాషలలో షుమారు 700 చిత్రాలలో నటించారు.
భారతీయ చలన చిత్ర చరిత్రలో సుదీర్ఘ కాలం వెండితెరపై వెలిగిన ఘనమైన చరిత్ర జైరాజ్ ది. 1995 లో ‘గన్ అండ్ గాడ్’ అనే సినిమా చేసి సినిమా పరిశ్రమ నుంచి తప్పుకున్నారు. అప్పుడు ఆయన వయసు 86 ఏండ్లు.
1931లో ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ తో సమానంగా సుమారు ఏడు దశాబ్దాల పాటు ప్రముఖ నటులలో ఒకరిగా కొనసాగారు.
మోహర్, మాలా (1943), ప్రతిమ, రాజ్ఘర్ , సాగర్ (1951) సహా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం దక్కింది.
జైరాజ్ 28, సెప్టెంబర్ 1909న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ)లోని సిరిసిల్లాలో జన్మించారు. పైడి సుందర రాజు, పైడి దీనదయాళ్.. జైరాజ్ కు అన్నయ్యలు.
హైదరాబాద్ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో ఆంగ్ల నాటకాలు, చలనచిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నారు.
తన కలలను సాకారం చేసుకునేందుకు ఆయన బొంబాయికి వెళ్లారు.
1929లో ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే మూకీ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృ భూమి’, ‘ఆల్ ఫర్ లవర్’ ,‘మహాసాగర్’ , ‘మోతి’ , ‘ఫ్లైట్ టు డెత్’, ‘మై హీరో’తో పాటు పదకొండు మూకీ చిత్రాలలో నటించారు.
ప్రస్తుతం గొప్పగా చెప్పుకుంటున్న బయోపిక్ లను ఆ కాలంలోనే జైరాజ్ నటించి మెప్పించారు.
సినిమా వారసత్వం అసలే లేని తెలంగాణ నుంచి జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన పైడి జైరాజ్ ఆగస్ట్ 11, 2000లో కన్నుమూశారు.