Rashmika: తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై రష్మిక నవ్వుల్ - ఎవరితో డ్యాన్స్ చేసిందో తెలుసా?
Rashmika appears On Telugu Indian Idol Season 3: ఆహా ఓటీటీ సోమవారం సాయంత్రం ఓ పజిల్ వదిలింది. 'మీకు అర్థమవుతోందా? తెలుగు ఇండియన్ ఐడల్ 3కి ఎవరు వస్తున్నారో?' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ క్యాప్షన్, ఆ వీడియో చూస్తే... రష్మిక అని అందరికీ అర్థం అయ్యింది. 'మాకు తెలుసు మీరు కనిపెట్టేశారని! ఇంకెందుకు సీక్రెట్! ఇదిగో... మన తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై నేషనల్ క్రష్' అంటూ ఫోటోలు రిలీజ్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelugu Indian Idol Season 3 Episode 15&16 on August 2nd and 3rd at 7pm: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో 15, 16వ ఎపిసోడ్స్ ఆగస్టు 2న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ రెండు ఎపిసోడ్లలో రష్మిక కనిపిస్తారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్, గాయని గీతా మాధురితో రష్మిక.
తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజి మీద ఆ షో హోస్ట్, సింగర్ శ్రీరామ చంద్రతో స్టెప్పులు వేశారు. అందరినీ హుషారుతో నింపేశారు.
రష్మిక లేటెస్ట్ ఫొటోలతో పాటు మిగతా హీరోయిన్ల గ్యాలరీలు, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ - ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.