Kakuda OTT Release: కాకుడా... ఓటీటీలోకి పిల్ల దెయ్యంతో వందకోట్లు కొట్టిన దర్శకుడి కొత్త సినిమా
రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీం ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'కాకుడా'. డైరెక్టుగా జీ 5 ఓటీటీలో విడుదల కానుంది. దీని రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKakuda Movie Digital Streaming Date On Zee5: జూలై 12... జీ 5 ఓటీటీలో 'కాకుడా' స్ట్రీమింగ్ కానున్న తేదీ! తొలుత థియేటర్లలో విడుదల చేయడానికి ఈ మూవీ తీసినా... ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.
'కాకుడా' సినిమా స్పెషాలిటీ ఏమిటో తెలుసా? పిల్ల దెయ్యం నేపథ్యంలో వచ్చిన 'ముంజ్యా' వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది కదా! ఆ సినిమా దర్శకుడు Aditya Sarpotdar తీసిన చిత్రమిది. హారర్ కామెడీగా తెరకెక్కించారు.
Sonakshi Sinha First Movie Post Marriage: 'కాకుడా' సినిమా మరో స్పెషాలిటీ ఏమిటంటే... సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆవిడ తొలి సినిమా. థియేటర్లలో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
'కాకుడా' మూవీ మీద బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నారు. దానికి కారణం 'ముంజ్యా' సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.