Ashika Rangnath : నా సామి రంగ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అశిక రంగనాథ్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్లో పువ్వులున్న డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి మెరిసే మేకప్ లుక్లో ఫోటోలు దిగింది.(Image Source : Instagram/AshikaRangnath)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ భామ తెలుగులో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి పురస్కరించుకుని నా సామిరంగా సినిమా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. నాగార్జున హీరోగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధానపాత్రల్లో ఈ సినిమా విడుదలైంది. (Image Source : Instagram/AshikaRangnath)
ఈ భామ తెలుగులో రీసెంట్గా పరిచమైంది కానీ.. కన్నడలో ఇప్పటికి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కన్నడలోని పలు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ పొందింది. (Image Source : Instagram/AshikaRangnath)
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ పలు షోలకు వెళ్లింది. బిగ్బాస్ సీజన్ 7 సమయంలో కూడా ఈ చిత్రబృందం సినిమా గురించి ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో అశిక వరాలు అలియాస్ వరలక్ష్మి అనే పాత్రను పోషించింది.(Image Source : Instagram/AshikaRangnath)
నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ డైరక్టర్గా పరిచయమవుతున్నారు. సంక్రాంతి వేడుకగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందింది. (Image Source : Instagram/AshikaRangnath)
ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. మరెన్నో అవకాశాలను తెలుగులో అందుకుంటుంది ఈ బ్యూటీ. కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా తన సత్తా చాటుకుంటుంది.(Image Source : Instagram/AshikaRangnath)