Upcoming Movies: హాలీవుడ్ టు టాలీవుడ్.. ఈ వారం అలరించబోయే సినిమాలు ఇవే..
రీసెంట్ గా థియేటర్లు తెరుచుకోవడంతో 'తిమ్మరుసు', 'ఇష్క్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతవారంలానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలో కొన్ని ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇందులో భాగంగా విడుదలైన ఎనిమిది సినిమా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తొమ్మిదో సినిమా రాబోతుంది. ఆగస్టు 5న 'ఎఫ్ 9'ను ఇంగ్లీష్ తో పాటు హిందీ అలానే ఇతర భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.
జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ సినిమా 'ది సూసైడ్ స్క్వాడ్' కూడా ఆగస్టు 5నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెరికాతో పాటు ఇండియాలో కూడా విడుదల కానుంది.
తెలుగులో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ నటించిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు యూత్ ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఎమోషన్స్ తో కూడిన ఏడు పాత్రల సమాహారంగా తెరకెక్కుతోన్న సినిమా 'క్షీరసాగర మథనం'. అనిల్ పంగులూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు.
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేయనున్నారు.
హస్వంత్ వంగ, నమ్రత దరేకర్ కలిసి నటించిన సినిమా 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాను కూడా ఆగస్టు 6నే విడుదల చేయనున్నారు.
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన 'మెరిసే మెరిసే' సినిమాని పవన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ఆగస్టు 6న థియేటర్ లో విడుదల చేయనున్నారు.
మనోజ్ బాజ్పాయ్, నీనా గుప్తా కీలకపాత్రల్లో నటించిన చిత్రం 'డయల్ 100'. రెన్సిల్ డిసిల్వా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది.