Aaradhya Bachchan : ఐశ్వర్య రాయ్ అవార్డ్ తీసుకుంటుంటే ఆరాధ్య ఆనందం చూశారా? బచ్చన్ కూతురు ఎంత క్యూట్‌గా నవ్వేస్తోందో
ఆరాధ్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యతో కలిసి దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కి బచ్చన్ కూతురు హాజరైంది. (Images Source : intsagram/ SIIMA 2024)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐశ్వర్య రాయ్ అవార్డు తీసుకుంటుండగా.. ఆరాధ్య తన ఫోన్లో తల్లిని ఫోటోలు తీసింది. అందంగా నవ్వుతూ.. ఆ అవార్డును తీసుకుంటున్న తల్లి చూసి సంతోషపడుతోంది ఆరాధ్య. (Images Source : intsagram/ SIIMA 2024)
పొన్నియన్ సెల్వన్ 2లో భాగంగా.. Best Actress in a Leading Role (Critics) కేటగిరిలో ఐశ్వర్య రాయ్ సైమా 2024 అవార్డును అందుకుంది.(Images Source : intsagram/ SIIMA 2024)
ఈ మధ్య ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా.. ఆరాధ్యను తనతోనే తీసుకువెళ్తోంది. ఆరాధ్య కూడా తల్లికి తోడుగా ఉంటూ.. ఫోటోలకు నవ్వేస్తూ ఫోజులిస్తోంది.(Images Source : intsagram/ SIIMA 2024)
తల్లి కూతురు మధ్య ఉంటోన్న బాండ్‌ని వీరిద్దరూ అద్దం పడుతున్నారు. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య విడిగా ఉంటోందన్న రూమర్స్‌ను ఇప్పటికీ కన్ఫార్మ్ చేయలేదు. కానీ ఐశ్వర్య తన ఇన్‌స్టా హ్యాండిల్లో పేరు మార్చలేదు.(Images Source : intsagram/ SIIMA 2024)
అలాగే తనతో పాటు కూతురుని తీసుకెళ్లి.. ప్రతిదానిలో ఆరాధ్యనే ముందు పెడుతోంది ఐశ్వర్య. గతంలో హెయిర్ స్టైల్‌తో ఆరాధ్య ముఖాన్ని కవర్ చేసేవారు కానీ.. ఇప్పుడు ఆమెను అందమైన హెయిర్ స్టైల్స్‌తో, మ్యాచింగ్ ఔట్‌ఫిట్స్‌తో అందంగా ముస్తాబు చేస్తోంది ఐశ్వర్య. (Images Source : intsagram/ SIIMA 2024)