Kiara Advani: కియారా బాస్ లేడీ లుక్ - గ్రే కలర్ ప్యాంట్ సూట్లో స్టైలిష్ ఫోజులు
kiara Advani Latest Photos: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్‌లో నటిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసెన్సేషన్ డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా రెంజ్లో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవడ్ డెబ్యూ వార్ 2లోనూ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ వెరైటీ స్పష్టం చేసింది. అయితే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ వర్గాలు సైతం అది నిజమేనని అంటోన్నాయి. హిందీలో కార్తీక్ ఆర్యన్ జోడిగా 'సత్య ప్రేమ్ కి కథ' సినిమాతోనూ బిజీగా ఉంది.
ఇలా వరుస చిత్రాలతో, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న కియారా తాజాగా ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా బాస్ లేడీ గెటప్‌లో మెరిసింది.
గ్రే కలర్ ప్యాంట్ సూట్ ధరించి స్టైలిస్ లుక్‌లో ఆకట్టుకుంటుంది. గ్రే కలర్ బ్లేజర్, అదే కలర్ ట్రౌజర్‌లో కియారా చూడటానికి బాస్ లేడీ ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐడియాస్ ఆఫ్ ఇండియన్ సమ్మిట్‌లో కియారా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను బయటపెట్టింది.
తను సినీ పరిశ్రమలో హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా పెళ్లి అయితే ఇక హీరోయిన్స్ సినిమాల్లో నటించలేరు అని కొందరు ప్రేక్షకులకు ఉన్న నెగిటివ్ అభిప్రాయంపై కూడా స్పందించింది.
సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన సమయంలో బాలీవుడ్లో తనకు ఇకపై ఆఫర్లు రావని అందరూ విమర్శించారని చెప్పుకొచ్చింది. ‘‘తను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? తను ఇప్పుడే మంచి స్థాయికి చేరుకుంటుంది అని ఏదేదో అన్నారు.
కానీ నేను ప్రేక్షకులకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వారిలోనే మార్పు వచ్చింది. మామూలుగా ఈ విషయంపై దర్శకులకు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆడియన్స్‌కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మమ్మల్ని కేవలం ఒక పాత్రగానే చూస్తారు’’ అంటూ ప్రేక్షకులకే క్రెడిట్ మొత్తం ఇచ్చేసింది కియారా.
‘‘నా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే విషయంలో విజయం సాధించానని అనుకుంటాను. నేను ఏదైనా చేయాలనుకుంటే అది చేసేస్తాను’’ అని తన కెరీర్ నిర్ణయాల గురించి స్టేట్మెంట్ ఇచ్చింది కియారా అద్వానీ.
ప్రస్తుతం కియారా చేతిలో ఒక భారీ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్‌తో పాటు ఒక తెలుగు ప్రాజెక్ట్ కూడా ఉంది. రణవీర్ సింగ్, ఫర్హన్ అఖ్తర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘డాన్ 3’లో కియారానే హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.