Neha Shetty : లావెండర్ కలర్ డ్రెస్‌లో వావ్ వావ్గా కనిపిస్తున్న నేహా శెట్టి
హీరోయిన్ నేహా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. లావెండర్ కలర్ ఔట్ఫిట్లో తాజాగా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Neha Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలావెండర్ మిడీ వేసుకుంది. దానికి కింద మల్టీకలర్ బీడ్స్‌ను వేలాడదీశారు. ఈ మిడీపై వేసుకోవడానికి లావెండర్ కలర్ లాంగ్ బ్లేజర్ వచ్చింది. ఈ ఔట్‌ఫిట్‌ను నేహా చాలా అందంగా క్యారీ చేసింది.(Images Source : Instagram/Neha Shetty)
మినిమల్ మేకప్ లుక్‌తో, పీచ్ కలర్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది. హెయిర్‌ని కూడా బ్యాక్ పోనిటైల్ వేసుకుంది. ఎలాంటి ఆభరణాలు లేకుండానే తన లుక్‌ని ఎలివేట్ చేసింది ఈ బ్యూటీ.(Images Source : Instagram/Neha Shetty)
కన్నడ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించింది ఈ భామ. అనంతరం తెలుగులో 2018లో ఆకాశ్ పూరీ సరసన మెహబూబా సినిమా చేసింది.(Images Source : Instagram/Neha Shetty)
అనంతరం పలు తెలుగు సినిమాలు చేసింది కానీ.. ఇవేమి ఆమెకు అంత పేరు ఇవ్వలేదు. 2022లో డీజే టిల్లు మాత్రం ఈ భామకు ఓ రేంజ్ హిట్ ఇచ్చింది. రాధికగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.(Images Source : Instagram/Neha Shetty)
అనంతరం రూల్స్ రంజన్, బెదురులంక అనే సినిమాలు చేసింది. 2023లో ఈమె నర్తించిన సమ్మోహనుడా అనే సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. (Images Source : Instagram/Neha Shetty)