Bindu Madhavi Birthday: హ్యాపీ బర్త్ డే బిందు మాధవి - ఈ తెలుగింటి ఆడపులి ఎక్కడ పుట్టిందో తెలుసా? ‘బిగ్ బాస్’ బ్యూటీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
అందాల తెలుగమ్మాయి బిందు మాధవి 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. 1986 జూన్ 14న ఏపీలోని మదనపల్లెలో జన్మించింది.Photo Credit: Bindu Madhavi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిందు మాధవి కాలేజీ రోజుల్లోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పలు యాడ్స్ లో నటించింది. ముఖ్యంగా శరవణ స్టోర్స్, టాటా గోల్డ్ తనిష్క్ యాడ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Bindu Madhavi/Instagram
మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవికి సినిమా పరిశ్రమలోకి రావాలని ఉండేది. కానీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమె తండ్రి ఏకంగా 8 నెలల పాటు మాట్లాడ్డం మానేశారట. తల్లి కూడా ఆమె నిర్ణయాన్ని తొలుత అంగీకరించలేదు.Photo Credit: Bindu Madhavi/Instagram
తనిష్క్ యాడ్ చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల ‘ఆవకాయ్ బిర్యానీ‘ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో బిందు మాధవి మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Bindu Madhavi/Instagram
ఆ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ‘బంపర్ ఆఫర్‘ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అటు దిల్ రాజు చిత్రం ‘రామ రామ కృష్ణ కృష్ణ‘ సినిమాలో నటించింది.Photo Credit: Bindu Madhavi/Instagram
తెలుగు సినిమాల్లో నటిస్తున్న బిందు మాధవికి తమిళ సినిమా పరిశ్రమలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. కోలీవుడ్ దర్శకుడు చేరన్ ‘పొక్కిషమ్‘ అనే చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు.Photo Credit: Bindu Madhavi/Instagram
ఆ తర్వాత గౌతం మీనన్ శిష్యురాలు అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించిన ‘వప్పం‘ అనే తమిళ సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. నెమ్మదిగా తమిళంలో ఎక్కువ అవకాశాలు రావడంతో అక్కడే ఫోకస్ పెట్టింది. ‘కళుగు‘ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.Photo Credit: Bindu Madhavi/Instagram
బిందు మాధవి తెలుగులో చివరిసారిగా ‘పిల్ల జమీందార్‘(2011) చిత్రంలో కనిపించింది. ఇందులో సెకెండ్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోనే కొనసాగుతోంది.Photo Credit: Bindu Madhavi/Instagram
ప్రస్తుతం బిందు మాధవి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. గత ఏడాది ‘న్యూసెన్స్‘(2023) అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. నవదీప్ ప్రధానపాత్రలో నటించిన ఈ సిరీస్ లో ఆమె న్యూస్ ప్రెజెంటర్ గా కనిపించి ఆకట్టుకుంది.Photo Credit: Bindu Madhavi/Instagram
ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న బిందు మాధవికి ‘ఏబీపీ దేశం‘ బర్త్ డే విషెస్ అందిస్తోంది. ఇండస్ట్రీలో మరింత బాగా రాణించాలని కోరుకుంటుంది.Photo Credit: Bindu Madhavi/Instagram