Rashi Singh: అందాలన్నీ ‘రాశి’ పోసినట్లుగా.. ‘ప్రసన్నవదనం’ బ్యూటీ గ్లామర్ ట్రీట్, ఈమెను విలన్ అంటే నమ్మగలమా?
actress rashi singh latest photos: నటి రాశి సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం మూవీతో పలకరించింది ఈ బ్యూటీ 2016లోనే నటిగా తెరంగేట్రం చేసంది.
అప్పటి నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామకు ప్రసన్నవదనం మంచి విజయాన్ని అందించింది.
2019లో సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన రీసౌండ్ అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
దీంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పోస్టర్, జెమ్ అనే సినిమాల్లో నటించింది. కానీ, ఇవేవి ఆమె ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు.
ఈ క్రమంలో 2021లో వచ్చిన శశి సినిమాతో ఈ అమ్మికి తెలుగులో గుర్తింపు వచ్చింది. ఇక 2023లో యంగ్ టాలెంట్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా వచ్చిన 'ప్రేమ్ కుమార్' చిత్రంలో నేత్రగా సహానటి పాత్రలో అలరించింది.
కానీ పిక్చర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సంవత్సరంలో వచ్చిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో కూడా మెరిసింది. ఇటీవల ప్రసన్నవదనంలో మంచి హిట్ అందుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ భామ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట హాట్ షో చేస్తూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మెరూన్ చీరలో మెరిసింది. ఇందులో ఆమెను చూసి అందాలన్నీ ‘రాశి’ పోసినట్లుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.