In Pics: తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, జోరున వర్షంలోనే - ఫోటోలు
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. సాయంత్రం తిరుమలకు పయనమై రాత్రికి కొండపైకి చేరుకున్నారు.
చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ జూన్ 13న ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
తిరుమలలో జూన్ 12 రాత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా గాయత్రి నిలయం రెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. తిరుమలకు చేరుకున్న చంద్రబాబుకు జాయింట్ ఈవో వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్ స్వాగతం పలికారు.
అంతకుముందు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడికి బుధవారం రాత్రి 7.35 గంటలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు.
ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం పలికిన అధికారుల్లో చంద్రబాబుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కరికలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ సిమోషి, తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీలోని హెల్త్, ఎడ్యుకేషన్ జేఈవో గౌతమి తదితరులు స్వాగతం పలికారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు స్థానిక టీడీపీ నాయకులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 7.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరారు.
రేపు ఉదయం 7.30 గంటలకు తిరుమల శ్రీవారిని చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు.