సావిత్రి చేతిలోని ఈ పసివాడు.. ఇప్పుడు స్టార్ హీరో, చెప్పుకోండి చూద్దాం
ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్లలో చాలామంది ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలినవాళ్లే. బాలునటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు చాలా చిత్రాల్లో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తళుక్కున మెరిశాడు. వెంకటేష్ మాత్రం ‘ప్రేమ్ నగర్’ సినిమాలో మాత్రమే కనిపించారు. మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ పసివాడు.. ఎనిమిది నెలల వయస్సులోనే నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరి.. ఈ పసివాడు ఎవరో గుర్తుపట్టారా? ఈ రోజు 62వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ నటుడు మరెవ్వరో కాదు.. మన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున.
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ సినిమాలో నాగార్జున తొలిసారి పసివాడిగా వెండి తెరపై కనిపించారు.
ఆ తర్వాత ‘సుడిగుండాలు’ సినిమాలో మన ‘కింగ్’ కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత మరే చిత్రంలోనూ నాగార్జున బాల నటుడిగా నటించలేదు. రెండు సినిమాల తర్వాత నేరుగా హీరోగానే పరిచయమయ్యాడు.
అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగార్జున రెండవ కుమారుడు. చెన్నై నగరంలో 1959, ఆగస్టు 29న అక్కినేని నాగార్జున జన్మించారు.
1986లో నాగార్జున ‘విక్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటించిన ‘మజ్ను’, ‘సంకీర్తన’, ‘జానకి రాముడు’, ‘విక్కీ దాదా’, ‘గీతాంజలి’, ‘శివ’ సినిమాలు నాగార్జునను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ‘కిల్లర్’, ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘వారసుడు’, ‘క్రిమినల్’, ‘అల్లరి అల్లుడు’, ‘హలోబ్రదర్’ సినిమాలు తిరుగులేని విజయాన్ని అందించాయి.
1997లో ‘అన్నమయ్య’ సినిమాతో తాను ఎలాంటి పాత్రలైనా పోషించగలనని నిరూపించారు నాగార్జున ఆ తర్వాత ‘శ్రీరామదాసు’ సినిమాతోనూ ఆకట్టుకున్నారు.
‘మన్మథుడు’, ‘సంతోషం’ వంటి సినిమాలతో క్లాస్ హిట్ కొట్టిన నాగ్.. ఆ తర్వాత కూడా విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటూ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
నాగార్జున ‘శిరిడి సాయిబాబా’ సినిమాలో సాయిబాబాగా కనిపించారు. ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.
నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో హోస్ట్‌గా ఆకట్టుకున్నారు.
బిగ్‌బాస్ 3 హోస్ట్‌గాను బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నాగ్.. ఇప్పుడు బిగ్‌బాస్ 5తో ముందుకొస్తున్నారు.
‘గీతాంజలి’ సినిమాలో నాగార్జున
‘శివ’ సినిమాలో నాగ్
మన్మథుడు-2లో కింగ్
‘మనం’ సినిమాలో తండ్రి, కొడుకులు, కోడలితో నాగార్జున