Amritha Aiyer Photos : హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యార్ లేటెస్ట్ ఫోటోలు
అమృత అయ్యార్ తన తాజా సినిమా హనుమాన్ మూవీతో సంక్రాంతి హిట్ కొట్టింది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అమృత హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. (Image Source : Instagram/amritha_aiyer)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలను మించిన పాజిటివ్ టాక్ అందుకుంది హనుమాన్ సినిమా. ఎన్ని పెద్ద సినిమాలు వస్తున్నా.. ఏమాత్రం వాటికి భయపడకుండా చిత్రబృందం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి టాక్‌ను సంపాదించుకుంది.(Image Source : Instagram/amritha_aiyer)
అమృత అయ్యార్ తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో నటించిన బిగిల్ సినిమాతో పరిచమైంది. కానీ తెలుగులో రెడ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచమైంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఈ సినిమాలోని ఓ పాట బాగా హిట్ అయ్యింది.(Image Source : Instagram/amritha_aiyer)
చెన్నైలో పుట్టిన అమృత.. బెంగళూరులో పెరిగింది. గ్యాడుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత మలయాళం సినిమాలో ఓ చిన్నపాత్రతో వెండితెరకు పరిచమైంది.(Image Source : Instagram/amritha_aiyer)
తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించింది. అలా విజయ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేసింది.(Image Source : Instagram/amritha_aiyer)
గతంలో చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా.. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి చోట హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లిపోతుంది.(Image Source : Instagram/amritha_aiyer)