Hansika Motwani : జిమ్‌లో తలకిందులుగా వేలాడుతున్న హన్సిక.. ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్న హీరోయిన్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హన్సిక తాజాగా ఫిట్నెస్ గోల్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. జిమ్‌లో తాను ఎంతగా కష్టపడుతుందో ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.(Images Source : Instagram/HansikaMotwani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోయిన్లు కేవలం అందంగా ఉంటే సరిపోదు. ఫిట్‌గా కూడా ఉండాలి. అలా తన ఫిట్నెస్ గోల్స్‌తో అభిమానులను ఆకర్షిస్తుంది హన్సిక.(Images Source : Instagram/HansikaMotwani)
జిమ్‌లో తల కిందులుగా వేలాడుతూ.. తాను ఎంత ఫిట్‌గా ఉందో మరోసారి నిరూపించుకుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. Did y’all workout today ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/HansikaMotwani)
హన్సిక తెలుగు, తమిళంలో హీరోయిన్గా మంచి విజయాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈ భామ హిందీలో ఎన్నో సీరియల్స్ చేసింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/HansikaMotwani)
దేశముదురు, కందిరీగ, మస్కా, సింగం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాదాపు ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. (Images Source : Instagram/HansikaMotwani)
కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/HansikaMotwani)