Ganesh Chaturthi Celebration: ముంబై మార్కెట్లో శిల్పాశెట్టి సందడే సందడి.. ఇంటికి వినాయక విగ్రహం తీసుకెళ్లిన నటి
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎన్ని పనులున్నా సరే వినాయక చవితి వచ్చిందంటే చాలు యాక్టివ్ అవుతుంది. కరోనా నేపథ్యంలోనూ ఆమె గణేష్ చతుర్థిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముంబైలోని లాల్ బాఘ్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఆమె కొనుగోలు చేయడానికి రాగా అక్కడ సందడి నెలకొంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం శిల్పాశెట్టి తన కుటుంబసభ్యులతో కలిసి గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం వినాయక విగ్రహాన్ని ఆమె కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (PICS Credit: Manav Manglani)
ఈ ఏడాది గణేష్ విగ్రహం ఇంటికి తీసుకెళ్లిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా శిల్పాశెట్టి నిలిచింది. సల్వార్ కమీజ్ ధరించిన నటి ఏమాత్రం కంగారు లేకుండా ఇంటి నుంచి బటయకు వచ్చారు. మాస్కు లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది.
మరోవైపు శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో చిక్కుకున్నాడు. దాంతో ఆమె ఎంతో మనోవేధనకు లోనైంది. అయితే తనకు ఎంతో ఇష్టమైన దేవుడు వినాయకుడి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది.
చవితి పండుగ నేపథ్యంలో వినాయక విగ్రహం కోసం శిల్పాశెట్టి ముంబై లాల్ బాఘ్ మార్కెట్‌కు రాగా, అభిమానుల ఆమెతో సెల్ఫీలు, ఫొటోల కోసం ఎగబడ్డారు. ఇటీవల భర్తపై నమోదైన కేసులతో సతమతమవుతున్న శిల్పాశెట్టి అన్ని బాధలను దూరం చేసుకునేందుకు గణేష్ చతుర్థిని మార్గంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
గత ఏడాది వినాయక చవితి సంబరాలలో తన కూతురు సమీషా పాలు పంచుకోవడంతో శిల్పాశెట్టి ఆనందం రెట్టింపైంది. బాలీవుడ్ నటి సైతం చిన్నపిల్లలా మారిపోయి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటుందని తెలిసిందే.
శిల్పాశెట్టి 14 ఏళ్ల గ్యాప్ తరువాత హంగామా 2 సినిమాలో బాలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఆమె ప్రస్తుతం సోనీ సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. (All PICS Credit: Manav Manglani)