Tej Kurapati Turns Hero : హుషారు, షికారు, రౌడీ బాయ్స్ తర్వాత...
తేజ్ కూరపాటి సోలోగా హీరోగా నటించిన సినిమా 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. ఇందులో అఖిల ఆకర్షణ హీరోయిన్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెంకట్ వందెల దర్శకత్వంలో రాజధాని ఆర్ట్ మూవీస్, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ పతాకాలపై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. సెప్టెంబర్ 2న సినిమా విడుదల కానుంది. ఇందులోని 'ఏకాంత సమయం' పాటను ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథ చిత్రమిదని, ఇందులో యువతకు కావాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయని, వినోదం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెంకట్ తెలిపారు.
అనుకున్న సమయంలో, నిర్మాణ వ్యయంలో సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. సందీప్ సంగీతం, డా. భవ్య దీప్తి రెడ్డి సాహిత్యానికి చక్కటి స్పందన లభిస్తోందని వారు పేర్కొన్నారు.
తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జోగి బ్రదర్స్, అనంత్, బస్టాప్ కోటేశ్వరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ తో 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' సినిమా యూనిట్ సభ్యులు
'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' పోస్టర్ విడుదల చేసిన శ్రీకాంత్