Tamanna: ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా చేస్తున్న తమన్నా - బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో మిల్కీ బ్యూటీ తళుకులు
Tamanna Bhatia Stunning Look: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో ఓ ఊపు ఊపింది మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ ఈ మధ్య ఈ భామకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీంతో వెండితెరపై ఆమె సందడి తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్న తమన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
అంతేకాదు మూవీ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కి ప్రియుడు విజయ్ వర్మతో కలిసి సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ మిల్కీ బ్యూటీ ఓ ఈవెంట్లో సందడి చేసింది.
ఇందులో బ్లాక్ కలర్ లెహెంగాలో తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా నవ్వుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. హెవీ ఈయర్ రింగ్స్, లెహెంగాలో తమన్నా ట్రెడిషనల్ లుక్‌తో ఫిదా చేసింది.
ఇక చాలా రోజుల తర్వాత తమన్నాను ఇలా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తమన్నా స్టన్నింగ్ లుక్ చూసి వావ్ అంటున్నారు.
కాగా తమన్నా చివరిగా బాక్ సినిమాలో నటించింది. తమిళ డైరెక్టర్ సుందర్ సీ స్వయంగా దర్శకత్వం వహించి నటించి 'అరణ్మనై 4' సీక్వెల్లో ఈ మిల్కీ బ్యూటీ దెయ్యం పాత్రలో అదరగొట్టింది.
ఇక హిందీలో ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య తమన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది.
ఆ మధ్య అసలు సోషల్ మీడియాను పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య రెచ్చిపోతూ అందాల ఆరబోస్తూ ఫోటలకు ఫోజులు ఇస్తుంది. వాటిని తన ఇన్స్టాగ్రామ్ షేర్ నెట్టింట హీట్ పెంచుతుంది.
తమన్నా ట్రెడిషనల్ లుక్ తళుక్కున మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో, ట్రెడిషనల్ జూవెల్లరితో ఈ భామ ఫిదా చేసింది. ప్రస్తుతం తమన్నా ఫోటోలు ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.