Sreeleela New Look: శ్రీలీల కొత్త లుక్ చూశారా? - పూర్తిగా మెకోవరైన కన్నడ బ్యూటీ, హాలీవుడ్ హీరోయిన్లా ఉందంటూ కామెంట్స్
Sreeleela New Look Goes Viral: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల స్టైల్ మార్చేసింది. మోడ్రన్‌గా మెకోవర్ అయిన తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందులో శ్రీలీల వైట్ ఫ్రాక్‌లో న్యూ హెయిర్ స్టైల్‌తో కొత్తగా కనిపించింది. వైట్ ప్రాక్‌లో కెమెరా పట్టుకుని ఫోజులు పోయింది. శ్రీలీల కొత్తలుక్ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్‌ని స్టన్ అవుతున్నారు.
ఈ ఫోటోలను 'నన్ను నేను మళ్లీ పరిచయం చేసుకోనివ్వండి' (Let me reintroduce myself) అంటూ షేర్ చేసింది. ఇక కన్నడ భామ కొత్త లుక్ చూసి హాలీవుడ్ హీరోయిన్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి శ్రీలీల తన నయా లుక్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. కాగా శ్రీలీల చివరిగా 'గుంటూరు కారం' చిత్రంలో నటించింది.
ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన 'రాబిన హుడ్' మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.