Sitara Ghattamaneni: అలియా భట్‌తో క్యూట్ సెల్ఫీ - ఆలస్యంగా ఫోటోలు షేర్ చేసిన సితార
Sitara Shared Selfie With Alia Bhatt: అంబానీ పెళ్లి మహేష్ బాబు కూతురు సితార చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అక్కడికి వచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీలందరితో సెల్పీలు దిగుతూ తెగ హంగామా చేసింది. ఇప్పటికే ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, ప్రియాంక చోప్రా-నిక్ జోనస్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా, నటి రేఖతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
అయితే కాస్తా ఆలస్యంగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌తో దిగిన ఫోటోలు షేర్ చేసింది. అలియా భట్‌తో కలిసి క్యూట్‌గా సెల్ఫీకి ఫోజులు ఇచ్చింది.
దీనికి fangirling mode : ON!!! all smiles with @aliaabhatt హార్ట్, స్మైలీ, లవ్ ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలను నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
కాగా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు పది రోజుల పాటు ఘనంగా జరిగాయి. జూలై 12న వీరి అనంత్-రాధికాలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అనంత్-రాధిక పెళ్లి ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి సినీ తారలంతా హాజరై సందడి చేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత