Sonakshi Sinha Zaheer Iqbal Wedding Photos: బయటకు వచ్చిన సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటోలు - ఇంత సింపుల్గా చేసుకుందా?
సోనాక్షి సిన్హా... ఇకపై మిస్ కాదు. ఇవాళ ఆవిడ మిస్సెస్ అయ్యారు. ఓ ఇంటి కోడలిగా జీవితంలో కొత్త దశలో అడుగు పెట్టారు. ప్రేమించిన జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చూడండి. (Image Courtesy: aslisona / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోనాక్షి సిన్హా హిందువు. జహీర్ ఇక్బాల్ ముస్లిం. ప్రేమకు, పెళ్లికి మతం అడ్డు కాదని వీళ్లిద్దరూ మరోసారి నిరూపించారు. ఈ హీరో హీరోయిన్లు సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరి మతానికి సంబంధం లేకుండా సంతకాల పెళ్లి (రిజిస్టర్ మ్యారేజ్)తో ఒక్కటి అయ్యారు. (Image Courtesy: aslisona / Instagram)
జూన్ 23... ఇవాళ పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను సోనాక్షి సిన్హా తెలిపారు. తామిద్దరం ఏడేళ్ల క్రితం ఇదే రోజున ప్రేమలో పడ్డామని వివరించారు. ఒకరి కళ్లలో మరొకరికి ప్రేమ కనిపించిందని చెప్పారు.(Image Courtesy: aslisona / Instagram)
సోనాక్షి సిన్హా పెళ్లిలో ఆమె తండ్రి, ఒకప్పటి హిందీ హీరో, ప్రస్తుత ఎంపీ శత్రుఘ్న సిన్హాతో పాటు కుటుంబ సభ్యులు సందడి చేశారు. సోనాక్షి పెళ్లి ఆమె ఫ్యామిలీకి ఇష్టం లేదనే పుకార్లకు తమ హాజరుతో చెక్ పెట్టారు. (Image Courtesy: aslisona / Instagram)
జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో నటించారు. అందులో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి సైతం నటించారు. ఈ పెళ్లిలో ఆవిడ కూడా సందడి చేశారు. (Image Courtesy: aslisona / Instagram)
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో స్టార్ హీరోయిన్ కాజోల్ సైతం ఉన్నారు. (Image Courtesy: aslisona / Instagram)