Sonakshi Sinha Zaheer Iqbal Wedding: పెళ్లి తర్వాత రెడ్ శారీలో సోనాక్షి, సింపుల్గా జహీర్... రిసెప్షన్లో కొత్త జంట సందడి చూశారా?
మిస్టర్ అండ్ మిస్సెస్ జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా! ప్రేక్షకులు అందరూ ఇకపై ఈ జోడీని ఇలాగే పిలవలేమో!? ఎందుకంటే... వెళ్ళింది కదా మరి! ఏడేళ్ల ప్రేమ తర్వాత వీళ్ళిద్దరూ జూన్ 23న ఒక్కటి అయ్యారు. పెళ్ళైన వెంటనే కొత్త జంట ఇలా సందడి చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతండ్రి శత్రుఘ్న సిన్హా ఇంట్లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో సోనాక్షి సిన్హా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకుకు సంబంధించిన సంప్రదాయాల్లో కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులు ఒక్కటి అయ్యారు.
పెళ్లైన వెంటనే బాలీవుడ్ సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున రిసెప్షన్ పార్టీ ఇచ్చారు సోనాక్షీ సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులు. సుమారు వెయ్యి మందికి పైగా ఆ పార్టీ అటెండ్ అయినట్టు తెలిసింది. అక్కడికి కొత్త జంట ఈ డ్రస్ లో వచ్చింది.
ఏడేళ్ల క్రితం తామిద్దరం జూన్ 23న ప్రేమలో పడినట్టు సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చారు. అంటే... ఆ తేదీన ఒకరి కళ్ళలో మరొకరికి ప్రేమ కనిపించిందట. అందుకే, ఆ తేదీన పెళ్లి చేసుకున్నామని తెలిపారు.
రెడ్ శారీలో సోనాక్షి సిన్హా ధగధగ మెరిసిపోగా... జహీర్ ఇక్బాల్ వైట్ షేర్వాణీలో వచ్చారు. ప్రజెంట్ ఈ జోడీ గురించి బాలీవుడ్ జనాలు అందరూ డిస్కస్ చేస్తున్నారు.
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.