Sobhita Dhulipala: బంజారా థీమ్ డ్రస్‌లో అక్కినేని కోడలు శోభిత - విశాఖలో యంగ్ పీపుల్ పార్టీ కోసం...
విశాఖలో బ్లరీ నైట్ ఫోటోలు అని శోభితా ధూళిపాళ ఈ ఫోటోలను షేర్ చేశారు. యంగ్ పీపుల్ పార్టీ అని కూడా పేర్కొన్నారు. మరి, ఆ పార్టీ ఏమిటో మరి? ఆవిడ చెప్తే తప్ప తెలియదు. (Image Courtesy: sobhitad / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశోభితా ధూళిపాళ డ్రస్ వెనుక కహాని ఏమిటంటే... బంజారా థీమ్ పార్టీ అట. ఈ ఫోటోల్లో ఆ బంజరాతనం కనిపించింది కదూ! (Image Courtesy: sobhitad / Instagram)
విశాఖలో సామాను అంతా ప్యాక్ చేసేశారట. అక్కినేని ఇంటి కోడలు అయ్యారు కదా! అందుకని, ఇక్కడికి వచ్చేస్తున్నారు. రీసెంట్ గా న్యూయార్క్ టైమ్స్ కు నాగా చైతన్యతో కలిసి శోభితా ధూళిపాళ ఇంటర్వ్యూ ఇచ్చారు. (Image Courtesy: sobhitad / Instagram)
నాగ చైతన్యను తాను ఎప్పుడు కలిసినా సరే తెలుగులో మాట్లాడమని నాగ చైతన్య అనేవారని, తామ ఇద్దరి లవ్ లాంగ్వేజ్ తెలుగు అని శోభితా ధూళిపాళ తెలిపారు. (Image Courtesy: sobhitad / Instagram)
నాగ చైతన్యతో పరిచయమైన కొన్నాళ్లు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని, ఓ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వాళ్ళింటికి కూడా వెళ్లానని, అయితే గోవాలో చైతన్యతో వెళ్లినప్పుడు ప్రేమలో పడ్డానని శోభిత తెలిపారు. (Image Courtesy: sobhitad / Instagram)
శోభితా ధూళిపాళ కొత్త ఫోటోలతో పాటు లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: sobhitad / Instagram)