Shraddha Das: బ్లాక్ చీరలో శ్రద్ధాదాస్ సోయగాలు - గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ, ఫొటోలు వైరల్
శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది. ఈక్రమంలోనే స్టార్ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య సినిమాలు వెండితెరకు శ్రద్ధాదాస్ సందడి కరువైంది. కానీ, సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ అందాల ఆరబోస్తుంది. తాజాగా బ్లాక్ చీరలో తళుక్కున మెరిసింది ఈ బోల్డ్ బ్యూటీ
నటిగా పెద్దగా సక్సెస్ లేకపోయినా వెండితెరపై తన అందంతో అందరిని కట్టిపడేస్తుంది. అదే క్రేజ్‌తో బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటుంది. అయినా ఆమెకు ఆశించిన విజయం, గుర్తింపు మాత్రం లేదనే చెప్పాలి.
అయినప్పటికీ తన దగ్గరికి వచ్చిన ఆఫర్స్‌కి ఒకే చెబుతూ లక్క్ పరిక్షించుకుంటుంది. ఈ క్రమంలో స్పెషల్ సాంగ్స్, గ్లామర్ షో చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. ఓవైపు వెండితెరపై హాట్ షో చేస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో అందాల షో చేస్తూ రచ్చ చేస్తోంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉండే శ్రద్ధా.. హాట్‌బ్యూటీ అనిపించుకుంటుంది.
తాజాగా బ్లాక్ చీరలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. బ్లాక్ శారీ మ్యాజిక్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ చీరలో శ్రద్ధాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్య2లో గీతా ఆకట్టుకుంది.డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసింది. అంతేకాదు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
ఆర్య 2తో మంచి గుర్తింపు పొందిన శ్రద్దా అప్పటి నుంచి గ్లామరస్ పాత్రలు చేస్తూ వెండితెరపై సందడి చేస్తుంది. అలా ఇప్పటి వరకు మొత్తం 40 సినిమాల్లో నటించిన శ్రద్దా సరైన హిట్, ఫేం లేక ఇప్పటికీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.