Ram Charan: రామ్ చరణ్ డెనిమ్ షర్టులో ఏమున్నాడ్రా బాబూ - గ్లోబల్ స్టార్ క్యాజువల్ లుక్ కిర్రాక్ అంతే!
ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడ ఉన్నారో తెలుసా? దేశ రాజధాని ఢిల్లీలో! తన సతీమణి ఉపాసనతో కలిసి గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు చిరు ఆ అవార్డు అందుకోనున్నారు.
పద్మ విభూషణ్ పురస్కారం స్వీకరణకు బుధవారం సాయంత్రం చిరంజీవి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట సతీమణి సురేఖ సైతం ఉన్నారు. గురువారం ఉదయం రామ్ చరణ్, ఉపాసన దంపతులు వెళ్లారు.
రామ్ చరణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు... ఫ్లైట్ జర్నీలో డెనిమ్ షర్ట్ ధరించారు. ఆ షర్టులో గ్లోబల్ స్టార్ లుక్ కిర్రాక్ ఉందని, రచ్చ రచ్చే అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ లుక్ మాత్రమే కాదు... ఆయన సతీమణి ఉపాసన స్టైల్ సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. చరణ్, ఉపాసన స్టైల్ గోల్స్ సెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ప్రస్తుతం స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్