Ram Charan Visit Tirumala: పుట్టినరోజున తిరుపతి వెంకన్న సన్నిధిలో కుమార్తెతో రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన దంపతులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆలయానికి కుమార్తెతో పాటు వెళ్లి స్వామి సన్నిధిలో కాసేపు గడిపారు. ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా స్వామి సేవలో తరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజూన్ 20న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించారు. ఆ అమ్మాయికి క్లింకారా అని నామకరణం చేశారు. అయితే... ఇప్పటి వరకు అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. చిన్నారికి దిష్టి తగలకుండా చూస్తున్నారు.
రామ్ చరణ్ కు భక్తి ఎక్కువ. ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుంటారు. శబరిమల స్వామి సన్నిధికి వెళ్లి వస్తుంటారు. తిరుమల తిరుపతి వెంకన్నను సైతం దర్శించుకుని మొక్కులు చెల్లించడం ఆయనకు అలవాటు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో అల్లూరి సీతారామ రాజు వేషధారణలో రామ్ చరణ్. ఈ క్యారెక్టర్, అందులో నటన ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC 16 movie బర్త్ డే విషెష్ చెబుతూ విడుదల చేసిన ఫోటో