RRR షూటింగ్ అరుదైన చిత్రాలు - అలా మొదలై, ఇలా విడుదలైంది, ఈ ఫొటోలు అస్సలు మిస్ కావద్దు!
‘బాహుబలి’ తర్వాత సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో చిత్రం.. RRR. ఈ చిత్రం ఇప్పటికే పలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ చిత్రం గురించి జక్కన్న అండ్ టీమ్ ఎంత శ్రమించారనేది మాటల్లో చెప్పడం కష్టమే.
మొదట్లో RRR పూర్తి చేయడానికి 240 రోజులు అనుకున్నారు. కానీ, మరో 60 రోజులకు పెంచారు.
‘బాహుబలి’ రెండు సీరిస్‌లను 600 రోజుల్లో పూర్తిచేయగా RRRకు 300 రోజులు పట్టింది.
2018, నవంబరు 19న మొదలైన షూటింగ్, 2021-ఆగస్ట్ 26న ఉక్రేయిన్‌లో ముగిసింది.
మధ్యలో కోవిడ్-19 వల్ల షూటింగ్‌కు చాలాసార్లు అంతరాయం వాటిల్లింది.
ఈ చిత్రానికి రూ.550 కోట్లు వరకు వెచ్చించినట్లు సమాచారం.
కొన్ని సీన్లను గండిపేటలో రాజమౌళి కొడుకు కార్తికేయ ఫ్రెండ్‌కు చెందిన 10 ఎకరాల స్థలంలో ఢిల్లీ సెట్ వేశారు.
RRRను హైదరాబాద్‌తోపాటు నెదర్లాండ్, బల్గేరియా, గుజరాత్, ఉక్రెయిన్‌లలో చిత్రీకరించారు.
మొదట్లో 28 నైట్ షూట్స్ అనుకున్నారు. కానీ, జక్కన్న 60 రాత్రిళ్లు షూట్ చేశారు.
ఈ చిత్రం షూటింగ్ మొదలు కావడానికి ముందు 200 రోజులు రిహార్సల్స్ చేశారు.
9 మంది కో-డైరెక్టర్లు, 3 వేల మంది సాంకేతిక నిపుణులు RRR కోసం పనిచేశారు.
‘RRR’ టీమ్ ఇప్పుడు దేశమంతా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
‘బాహుబలి’ సీరిస్‌తో పోల్చితే ఈ సినిమాకు ఎన్నడూలేనంతగా ప్రచారం చేస్తున్నారు.
ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకూ ఈ స్థాయిలో ప్రచారం కల్పించలేదు.
‘RRR’తో పోల్చితే ‘బాహుబలి’పై అప్పట్లో ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉండేవి. దీంతో ప్రచారానికి పెద్ద శ్రమించలేదు.
‘బాహుబలి’తో ప్రేక్షకాధరణ పొందిన రాజమౌళి ‘RRR’పై కూడా ఆశలు పెట్టుకున్నారు.
ఇది కూడా ‘బాహుబలి’ స్థాయిలో హిట్ కావాలని ఇద్దరు హీరోలతో తీరికలేకుండా ప్రచారం కల్పించారు.
RRR ప్రమోషన్స్ కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రైవేట్ జెట్‌లోనే తిరిగారు.
దుబాయ్‌కు కూడా వెళ్లి RRRకు గట్టిగానే ప్రచారం చేశారు.
కేవలం ప్రమోషన్లకే RRR టీమ్ రూ.20 కోట్లు ఖర్చు చేశారని ఇండస్ట్రీ టాక్.
‘బాహుబలి’కి కూడా ఈ స్థాయిలో ప్రచారం చేయలేదట.
ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను ఇతర రాష్ట్రాల ఇవెంట్స్‌కు కూడా తరలించారట. ఇందుకు రూ.2-3 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సినిమా ఉండబోతుందని ప్రకటిస్తూ రాజమౌళి పోస్ట్ చేసిన RRR మొదటి చిత్రం ఇదే.
మొత్తానికి RRR షూటింగ్ ముగించుకుని, ప్రమోషన్లు కూడా పూర్తి చేసుకుని మార్చి 24 నుంచే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.