Raashii Khanna: గ్రీన్ గౌన్‌లో ఎల్లోరా శిల్పాంలా రాశీ ఖన్నా - ఈవెంట్ నైట్ కోసం రెడీ
సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌లో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది రాశీ ఖన్నా. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా సైన్ చేస్తూ బిజీ అయిపోయింది.
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా రాశీ ఖన్నా బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తన ఫోటోషూట్స్‌కు లైకులు కొట్టేస్తుంటారు.
తాజాగా ఐఫా ఉత్సవం కోసం గ్రీన్ ఫ్రాక్‌లో ముస్తాబయిన రాశీ ఖన్నా.. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది.
ఈ ఫోటోషూట్స్‌ను చూసి రాశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గ్రీన్ ఫ్రాక్‌లో ఎల్లోరా శిల్పంలాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గ్రీన్ ఫ్రాక్‌పై గోల్డ్ కలర్ డిజైనర్ కమ్మలు, ఒక చేతినిండా గాజులతో చాలా స్టైలిష్‌గా రెడీ అయ్యింది ఈ భామ.
రాశీ ఖన్నా ఒక తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయ్యింది. చివరిగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’లో కనిపించి అలరించింది.
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
‘తెలుసు కదా’తో పాటు రాశీ ఖన్నా చేతిలో రెండు హిందీ ప్రాజెక్ట్స్, ఒక తమిళ ప్రాజెక్ట్ కూడా ఉంది.