Priyanka Mohan: చక్కని చుక్క చేతిలో చిక్కని కాఫీ - ప్రియాంక.. నీ అమాయక చూపుల్లో ఏదో మత్తుంది!
ప్రియాంక మోహన్.. ఈమె పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘గ్యాంగ్ లీడర్’ మూవీనే. నాని నటించిన ఈ మూవీలో ప్రియాంక పాత్ర చూపు తిప్పుకోనివ్వదు. కళ్లతోనే ఎన్నో భావాలు పలికించే ఈ చిన్నది.. మళ్లీ టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘OG’, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు సిద్ధమవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతోనే ప్రియాంక వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శార్వానంద్తో ‘శ్రీకారం’ మూవీలో నటించింది. అయితే, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.
రెండో సినిమా ఫ్లాప్ కావడంతో ప్రియాంకకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, కోలీవుడ్ నుంచి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత ప్రియాంక కెరీర్ అనూహ్యంగా మలుపు తిరిగింది.
శివకార్తికేయన్‌తో నటించి ‘డాన్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత సూర్యతో ‘ఈటీ’ మూవీలో నటించింది. ఆ మూవీలో కూడా ప్రియాంకకు మంచి మార్కులే పడ్డాయి.
శివ కార్తికేయన్‌తో మరోసారి జతకట్టిన ప్రియాంక ‘డాన్’ మూవీతో హిట్ కొట్టింది. ఇటీవల ధనుష్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’లో మాస్ క్యారెక్టర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తమిళంలో ‘బ్రదర్’ అనే మూవీలో నటిస్తోంది.
నానితో కలిసి నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 29న రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ రిలీజ్ కానుంది.
ప్రియాంక ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. తాను నటించిన ‘టిక్ టాక్’ అనే మూవీ నుంచి హాట్ సీన్స్, సాంగ్స్‌ను తొలగించాలని ఒత్తిడి చేసిందని, దీంతో మూవీలో సుమారు 20 నిమిషాల సీన్స్ మిస్ అయ్యాయని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘గ్యాంగ్ లీడర్’ కంటే ముందు ప్రియాంక ‘టిక్ టాక్’లో మూవీలో నటించింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మూవీ ఆలస్యంగా విడుదలైంది. ఆ తర్వాత ప్రియాంకాకు టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. తన ఫ్యామిలీ ఇమేజ్‌కు భంగం వాటిల్లుతుందనే కారణంతో ఆమె స్వయంగా ఆ సీన్స్ తొలగించడానికి ఒత్తిడి చేసిందని, ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా తెలియజేయకుండా.. చేశారని పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.