Priyanka Chopra: మహేష్ - రాజమౌళి సినిమా SSMB29 సెట్స్‌లో హోలీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra at SSMB29 Sets: గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్న భారతీయ కథానాయిక ప్రియాంక చోప్రా. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం అమెరికా షిఫ్ట్ అయిన ఆవిడ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియా వచ్చారు. హోలీకి ఆవిడ ఇండియాలో ఉన్నారు. ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికల రూపొందుతున్న సినిమా లొకేషన్ లో! (Image Courtesy: priyankachopra / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మహేష్ బాబు రాజమౌళి సినిమా SSMB29లో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒరిస్సా రాష్ట్రంలోని కోరట్ పూర్ లో జరుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్ లో ప్రియాంక సైతం పాల్గొంటున్నారు. తన బృందంతో కలిసి సినిమా చిత్రీకరణ జరిగే దగ్గర హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. (Image Courtesy: priyankachopra / Instagram)

ఇటీవల ప్రియాంక భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ కూడా ఇండియా వచ్చారు. ప్రియాంక తమ్ముడు సిద్ధార్థ పెళ్లి కోసం నిక్ ఫ్యామిలీ అంతా ఇండియాలో సందడి చేసింది. (Image Courtesy: priyankachopra / Instagram)
తమ్ముడు సిద్ధార్థ్ పెళ్లిలో ప్రియాంక వేసుకున్న దుస్తులలో ఇదొకటి. (Image Courtesy: priyankachopra / Instagram)
హోలీ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రియాంక తన సెలబ్రేషన్ ఫోటోలతో పాటు ఈ రంగులను సైతం ఫోటో తీసి షేర్ చేశారు. (Image Courtesy: priyankachopra / Instagram)