Prabhas New Movie: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ప్రారంభోత్సవం - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సందడి, ఫోటోలు వైరల్
Prabhas-Hanu Raghavapudi Movie Launch Photos: ప్రభాస్-హను రాఘవపూడి సినిమా ఇవాళ (ఆగస్టు 17) పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది. హైదరాబాద్ నేడు సైలెంట్‌గా ఈ సినిమాను ప్రారంభోత్సవాన్ని జరిపించింది మూవీ టీం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, చెరుకూరి మోహన్లుతో ఇతర చిత్ర బృందం పాల్గొంది.
అలాగే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది.
ఈ వేడుకలో హీరోయిన్ కూడా పాల్గొంది. కాగా ఇందులో ప్రభాస్ సరసన కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తుంది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయేన్సరైన ఆమె కొరియోగ్రాఫర్, ఆర్టస్టు కూడా.
ఈ సినిమాతోనే తొలిసారి హీరోయిన్గా నటిస్తుంది. దీంతో ఫస్ట్ మూవీతోనే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన చాన్స్ కోట్టేయడంతో ఇమాన్ ఇస్మాయిల్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది.
ఇక ఈసినిమా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రదలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది. ఇక సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా ఈ సినిమా కథ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథని అంటున్నారు. ఇందులో ప్రభాస్ బ్రహ్మణ యువకుడిగా కనిపించనున్నాడట.
పూజా కార్యక్రమంలో హను రాఘవపూడితో హీరో ప్రభాస్