Nidhi Agarwal: 'రాజా సాబ్' సెట్‌లో నిధి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన మూవీ టీం
Happy Birthday Nidhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్‌డే నేడు. ఆగస్టు 17న ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వదులుతూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్-మారుతి సినిమా 'రాజా సాబ్' నుంచి ఊహించని అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మాళవిక మోహనన్, రాధేశ్యామ్ ఫేం రిద్ధి కుమార్‌లు కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే నేడు నిధి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా ఆమెను రాజా సాబ్ సెట్లోకి ఆహ్వానిస్తూ టీం అప్‌డేట్ ఇచ్చింది. అంతేకాదు మూవీ సెట్లో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
వీటికి Team #TheRajaSaab is thrilled to welcome the stunning @AgerwalNidhhi on board! Celebrating her birthday on set with loads of love and excitement అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆమె నటిస్తున్న మరో చిత్రం 'హరి హర వీరమల్లు' టీం కూడా నిధికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఆమె కొత్త లుక్ విడుదల చేసింది.