Chiru Odela Movie: మెగా అభిమానులకు నాని బ్లడీ ప్రామిస్... చిరంజీవితో ఫ్యాన్ బాయ్ సినిమా మామూలుగా ఉండదు
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. దసరా తర్వాత మరోసారి నాని హీరోగా ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఆ తరువాత తన అభిమాన కథానాయకుడిని దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందునున్న సినిమాని నాచురల్ స్టార్ నాని అనానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి డిసెంబర్ మూడవ తేదీ రాత్రి ప్రకటించారు. ఈరోజు ఆ సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చారు నాని. బ్లడీ ప్రామిస్ అంటూ ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని పరోక్షంగా చెప్పారు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న పారడైజ్ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. He finds his peace in violence - హింసలోనే అతను శాంతి (ప్రశాంతత) ను చూసుకుంటున్నాడు అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు.
విశ్వంభర సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరంజీవి. ఆ తరువాత తన అభిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అభిమానుల కోరుకునే మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ ఉన్న కథతో సినిమా రూపొందుతుందని సమాచారం.
ఫ్యాన్ బాయ్ తాండవం అంటూ చిరంజీవితో దిగిన ఫోటోలను శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమాపై ఆల్రెడీ అభిమానులలో అంచనాలు మొదలు అయ్యాయి.